RJNEWS TELUGU
Date of Publish : 18 August 2026, 4:50 pm Posted by : RJ NEWS TELUGU

ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కల్యాణమహోత్సవం

ఆర్.జె.న్యూస్, శామీర్ పేట : అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్‌గడి మలక్‌పేట్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కల్యాణమహోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి కార్యక్రమంలో పాల్గొని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కల్యాణమహోత్సవానికి భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమం సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని చామకూర మల్లారెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ల కుమార్ యాదవ్, యూసఫ్, దాస్ గౌడ్,నాయకులు మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి,రవి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు