KLR ఫేజ్-2 సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే మల్లారెడ్డికి మహిళల వినతి
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ సర్కిల్ పరిధిలోని KLR ఫేజ్-2, రాములోరి మైసమ్మ గుడి కాలనీలో నెలకొన్న తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహిళా సేవా సమితి సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.కాలనీలో తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడం, వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారడం, డ్రైనేజీ నీరు రోడ్లపైకి పొంగిపొర్లుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా రాములోరి మైసమ్మ గుడి...