ఆర్.జె.న్యూస్, గాజులరామారం : ఆధ్యాత్మిక వైభవానికి గాజులరామారం వేదిక కానుందని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. గాజులరామారంలోని చితారమ్మ ఆలయ ప్రాంగణంలో శ్రీ నకులేశ్వరి దేవి సిద్ధి పీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కోటి దీపోత్సవం పోస్టర్ ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణకు ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. భక్తిభావాన్ని పెంపొందించేందుకు కోటి దీపోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అంతయ్య గౌడ్, ఇంద్రసేనారెడ్డి, బాలరాజ్, సిద్ధి పీఠం ప్రతినిధి నందు పంతులు, స్థానిక నాయకులు బుచ్చిరెడ్డి, మోతే శ్రీనివాస్ యాదవ్, ఆర్వ వెంకట్, ప్రభాకర్ రెడ్డి, షాకీర్, తోసిఫ్ తదితరులు పాల్గొన్నారు.