గాజులరామారంలో కోటి దీపోత్సవం పోస్టర్ ఆవిష్కరణ
ఆర్.జె.న్యూస్, గాజులరామారం : ఆధ్యాత్మిక వైభవానికి గాజులరామారం వేదిక కానుందని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. గాజులరామారంలోని చితారమ్మ ఆలయ ప్రాంగణంలో శ్రీ నకులేశ్వరి దేవి సిద్ధి పీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కోటి దీపోత్సవం పోస్టర్ ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణకు ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. భక్తిభావాన్ని పెంపొందించేందుకు కోటి దీపోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అంతయ్య గౌడ్, ఇంద్రసేనారెడ్డి,...