RJNEWS TELUGU
Date of Publish : 18 October 2026, 7:57 am Posted by : RJ NEWS TELUGU

రెండోసారి ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా కుండ భానుచందర్

🔸పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.. కుండ భానుచందర్

ఆర్ జె న్యూస్ , మేడ్చల్ : గుండ్లపోచంపల్లి 299 డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన కుండ భానుచందర్‌ తనకు మరోసారి అవకాశం కల్పించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మేడ్చల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌, మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి,మాజీ డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్‌గౌడ్‌, జిల్లా ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కావలి చెన్నయ్య, టీపీసీసీ ఎస్సీ సెల్‌ జనరల్‌ సెక్రటరీ మురళీ, మేడ్చల్‌ ఏ బ్లాక్‌ మాజీ అధ్యక్షుడు పానుగంటి మహేశ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.నాయకులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ డివిజన్‌లో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి, ఎస్సీ సెల్‌ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.