అల్వాల్‌లో హెల్మెట్ బ్యాంక్ ప్రారంభం

హెల్మెట్ లేని వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు.. 24 గంటల్లో తిరిగి అప్పగించాలి ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంపొందించడంతో పాటు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు, ట్రాఫిక్-1 డీసీపీ కె. రాహుల్ రెడ్డి చొరవతో మంగళవారం అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐజీ విగ్రహం వద్ద హెల్మెట్ బ్యాంకును ప్రారంభించారు. తిరుమలగిరి ట్రాఫిక్ డివిజన్...