ఫాక్స్‌సాగర్‌కు మహర్దశ.. 2027 అక్టోబర్ నాటికి స్వచ్ఛమైన జలాశయంగా తీర్చిదిద్దుతాం: రంగనాథ్

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువు అభివృద్ధిపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ (ఐఏఎస్ ) క్షేత్రస్థాయిలో పర్యటించారు. మంగళవారం హైడ్రా తొలగించిన అక్రమ బోరుబావులతో పాటు ప్రతిపాదిత అభివృద్ధి పనులను పరిశీలించారు. చెరువు పరిసరాల్లో అక్రమంగా నీటి వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై హైడ్రా మంగళవారం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫాక్స్‌సాగర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఏడు అక్రమ బోరుబావులను తొలగించడంతో పాటు వాటికి అనుసంధానంగా...