ఘనంగా రాఘవేంద్రనగర్ బోనాలు
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఆదివారం బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచే మహిళలు వివిధ వీధుల నుంచి కూడలి వద్దకు చేరుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో బోనాలను తలపై పెట్టుకుని, పోతురాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వరకు వెళ్లారు. భక్తి గీతాలు, కోలాటాలతో కాలనీ అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఆలయం...