కుళ్లిన అల్లం.. ఫంగస్‌ వెల్లుల్లితో పేస్ట్‌ తయారీ!

🔸అత్వెల్లిలో ‘ఏ1’ కేంద్రంపై అధికారుల మెరుపుదాడి 🔸22 కిలోల వెల్లుల్లి.. 50 కిలోల అల్లం స్వాధీనం చేసినట్లు వెల్లడి ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ :  ప్రజలకు విక్రయించే ఆహార పదార్థాల తయారీలో ఇంత నిర్లక్ష్యమా? ఫంగస్‌ పట్టి కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్‌ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించడం కలకలం రేపింది. మేడ్చల్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని అత్వెల్లి గ్రామంలో ‘ఏ1’ బ్రాండ్‌ తయారీ కేంద్రంపై శుక్రవారం ఉదయం ఎస్‌ఓటీ, టీజీసీఎఫ్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషనర్‌...