పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : శ్రావణమాసాన్ని పురస్కరించుకుని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో ఆదివారం పెద్ద ఎత్తున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, పలువురు దంపతులు, భక్తులు, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వేద పండితుల ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రావణమాసంలో సామూహికంగా వ్రతాలు నిర్వహించడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న దంపతులు, భక్తులు, సంఘ సభ్యులకు...