శంషాబాద్ లో భారీ ఏటీఎం చోరీ – రూ.30 లక్షలతో ఉడాయించిన దొంగలు

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఏటీఎం చోరీ సంచలనం సృష్టించింది. శాతంరాయి వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో రూ.30 లక్షలకు పైగా నగదు చోరీకి గురైంది. అర్ధరాత్రి సమయంలో ఏటీఎంలోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు ఏటీఎం మిషన్ ను ధ్వంసం చేసి, అందులోని నగదును ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించారు. సీసీ కెమెరా...