RJNEWS TELUGU
Date of Publish : 09 September 2026, 7:01 pm Posted by : RJ NEWS TELUGU

మయోరా ఇండియా ఉద్యోగుల ఆందోళన ఉద్ధృతం

🔸24వ రోజుకు చేరిన నిరసనలు.. 

🔸జాతీయ రహదారిపై అర్ధనగ్న ప్రదర్శన

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : గుండ్లపోచంపల్లి డివిజన్‌ పరిధిలోని మయోరా ఇండియా కంపెనీ ఉద్యోగుల నిరసన తీవ్రరూపం దాల్చింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కంపెనీ ఎదుట ఉద్యోగులు చేపట్టిన ఆందోళన బుధవారానికి 24వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ యాజమాన్యం నుంచి సమస్యల పరిష్కారంపై స్పష్టమైన స్పందన లేకపోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ఉద్యోగులు జాతీయ రహదారిపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.