ఎంసీహెచ్‌ కిట్‌ పోర్టల్‌ డేటా నమోదు పక్కాగా ఉండాలి

జాప్యం, తప్పిదాలకు తావివ్వొద్దు: డీఎంహెచ్‌ఓ డా. కె. ఆనంద్‌ ఆర్ జె న్యూస్,మేడ్చల్ : మాతా, శిశు ఆరోగ్య సేవలకు సంబంధించిన వివరాలను ఎంసీహెచ్‌ కిట్‌ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. కె. ఆనంద్‌ సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఎంసీహెచ్‌ కిట్‌ పోర్టల్‌లో వివరాల నవీకరణ, పర్యవేక్షణ, డేటా నాణ్యతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సంబంధిత ఆరోగ్య కేంద్రాల డీఈఓలు, ఏసీసీలు, సూపర్‌వైజర్లు సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా డా. ఆనంద్‌ మాట్లాడుతూ.....