విద్యుత్ షాక్‌తో మెకానిక్ మృతి..! మేడ్చల్ చెక్‌పోస్ట్‌లో విషాద ఘటన

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ చెక్‌పోస్ట్‌ సమీపంలోని హెచ్‌కేజీఎన్‌ హైడ్రాలిక్‌ ప్రెస్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అక్కడ మెకానిక్‌గా పనిచేస్తున్న బీహార్ కు చెందిన సునీల్ రామ్ (26) విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు.శుక్రవారం అర్ధరాత్రి రాత్రి సమయంలో హైడ్రాలిక్‌ ప్రెస్‌లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో సునీల్‌ రామ్‌కు విద్యుత్‌ షాక్‌ తగిలింది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.ఈ ఘటనతో తోటి కార్మికులు, సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.