అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మేడ్చల్ ఆశా కార్యకర్తల అరెస్ట్

ఆర్ జె న్యూస్ హైదరాబాద్ : డిమాండ్ల పరిష్కారం కోసం శుక్రవారం తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న మేడ్చల్ ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్డీయూ జిల్లా అధ్యక్షుడు సంబు ప్రభాకర్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి, పద్మలత, కృష్ణవేణి, రజిత, విమల, భాగ్యతార, రమణి, నాగమ్మ, జయసుధ, లక్ష్మి, సుజాత తదితర ఆశా కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. అసెంబ్లీకి కొద్ది దూరంలోనే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సంబు...