RJNEWS TELUGU
Newspaper Banner

కేటీఆర్ ను కలిసిన మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు..!

మేడ్చల్ ఆర్ జె న్యూస్ :

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బుధవారం మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల తిరుపతి దర్శనం చేసుకుని వచ్చిన మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కేటీఆర్‌ను కలిసి స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చ జరిగింది. మేడ్చల్ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధిపై భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్‌లను కేటీఆర్ అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చొరవ చూపాలని కేటీఆర్ సూచించారు. ప్రజలకు అవగాహన కలిగిస్తూ, ఎలాంటి తప్పులు జరగకుండా చూస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ సమావేశంలో మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.