కేటీఆర్ ను కలిసిన మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు..!

మేడ్చల్ ఆర్ జె న్యూస్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బుధవారం మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల తిరుపతి దర్శనం చేసుకుని వచ్చిన మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కేటీఆర్‌ను కలిసి స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చ జరిగింది. మేడ్చల్ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధిపై భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్‌లను కేటీఆర్ అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో...