సౌత్‌జోన్‌ అథ్లెటిక్స్‌లో మేడ్చల్‌ యువతికి కాంస్యం

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ ‌: పుదుచ్చేరిలో ఈ నెల 16న నిర్వహించిన సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో మేడ్చల్‌ సర్కిల్‌ అత్వెల్లికి చెందిన యువతి మండల స్నేహ కాంస్య పతకం సాధించింది. అండర్‌ –18 విభాగంలో తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించిన స్నేహ లాంగ్‌జంప్‌ విభాగంలో ప్రతిభ కనబరిచి మూడో స్థానంలో నిలిచింది. సౌత్‌జోన్‌ పోటీల్లో తొమ్మిది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనగా.. తెలంగాణ తరఫున స్నేహ కాంస్య పతకం సాధించడం విశేషం.పతకం సాధించిన స్నేహను మేడ్చల్‌ ప్రాంతానికి చెందిన పలువురు అభినందించారు. ఈ...