ఎస్సీ, ఎస్టీలకు వైద్య సాయం అంబేద్కర్‌ వైద్య సహాయ పథకం ద్వారా ఆర్థిక తోడ్పాటు

ఆర్.జె.న్యూస్,మేడ్చల్‌ : అర్హులైన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పేదలకు ‘డాక్టర్‌ అంబేద్కర్‌ వైద్య సహాయ పథకం’ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ మను చౌదరి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.భారత ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డాక్టర్‌ అంబేద్కర్‌ ఫౌండేషన్‌ ఈ పథకాన్ని 2004 జనవరి నుంచి అమలు చేస్తోందని తెలిపారు. వార్షిక కుటుంబ ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు తీవ్రమైన వ్యాధులకు చికిత్స...