RJNEWS TELUGU
Date of Publish : 10 August 2026, 6:45 am Posted by : RJ NEWS TELUGU

మెడికో ప్రియాంక మృతి..! రాజమండ్రిలో హిట్ అండ్ రన్

ఆర్.జె.న్యూస్, సికింద్రాబాద్ : రాజమండ్రిలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదం అనంతరం ఆమెను మెరుగైన వైద్యం కోసం సికింద్రా బాద్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలిం చారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినా పరిస్థితి విషమిం చడంతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రియాంక మృతి చెందింది. ఘటనకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ దూసి నరసింహ కిశోర్ మాట్లాడుతూ.. నిందితులు కారుతో ప్రియాంకను మూడు సార్లు ఢీకొట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.