పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: డీసీసీ అధ్యక్షుడు వజ్రెష్ యాదవ్
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ :మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్ల కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి కమిటీలను డీసీసీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రెష్ యాదవ్ బుధవారం ప్రకటించారు. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బండి శ్రీరాములు గౌడ్, తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని సూచించారు. నూతన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, జనరల్ సెక్రటరీ ఏనుగు జలంధర్‌రెడ్డి, మాజీ మేయర్ అమర్‌సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, గ్రంథాలయ మాజీ చైర్మన్ దర్గా దయాకర్‌రెడ్డి, సీనియర్ నాయకుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
