RJNEWS TELUGU
Date of Publish : 10 September 2026, 9:00 am Posted by : RJ NEWS TELUGU

హోటల్ లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం

ఆర్.జె.న్యూస్, మేడిపల్లి : బోడుప్పల్ లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని ఓ హోటల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతో పాటు దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో హోటల్ లో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.