మేడ్చల్‌లో శ్రీ గౌరీ లిక్కర్ మార్ట్‌లో అర్ధరాత్రి చోరీ

ఆర్ జె న్యూస్,మేడ్చల్ : మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శ్రీ గౌరీ లిక్కర్‌ మార్ట్‌లో అర్ధరాత్రి చోరీ చోటుచేసుకుంది. పర్మిట్‌ రూమ్‌ పక్కన ఉన్న రేకును కత్తిరించి దుండగులు దుకాణంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.ఉదయం నిర్వాహకులు దుకాణానికి చేరుకోగా రేకు కత్తిరించి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీకి గురైన మద్యం, నగదు తదితర వివరాలను నిర్వాహకుల నుంచి పోలీసులు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.