దసరాలోగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేస్తాం: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : గత పదేళ్లలో సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య ఆరోపించారు. మిషన్‌ భగీరథ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా అనేక గ్రామాలకు తాగునీరు అందలేదని విమర్శించారు.మంగళవారం శామీర్‌పేట మండలంలోని ఘన్‌పూర్‌గుట్ట మిషన్‌ భగీరథ పనులను భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. అధికారులతో పాటు కాంట్రాక్టర్లను పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.1,212 కోట్లతో దాదాపు...