ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : గణేష్ చతుర్థి సందర్భంగా నేరేడ్మెట్‌లోని వివిధ గణేష్ మండపాలకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్ నాయకుడు జేకే సాయి గౌడ్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. గణేష్ ఉత్సవాలు సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రావుల అంజయ్య, జీకే హనుమంతరావు, బద్దం పరుశురాం రెడ్డి, చిన్న యాదవ్, జేకే సాయి గౌడ్, శివ గౌడ్, శంకర్ రావు, రాజేష్ గౌడ్, నవీన్ రాజు, అవినాష్, రఘుపతి రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.