ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ హక్కుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై అనంత లా కాలేజీలో ఐదవ అంతర్గత మూట్ కోర్ట్ పోటీలు ఘనంగా జరిగాయి. గురువారం కూకట్ పల్లిలోని కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో 38 జట్లు పాల్గొని తమ వాదనా పటిమను ప్రదర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.వి. చంద్రమతి, కరస్పాండెంట్ డా. రవి అనంత మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి న్యాయశాస్త్ర విభాగం డీన్ ప్రొఫెసర్ డా. ఎన్. వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవతా విలువలు చట్టపరమైన నిబంధనల కంటే అత్యున్నతమైనవని, సాంకేతిక మార్పులకు అనుగుణంగా న్యాయ విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. మూట్ ప్రపోజిషన్ చక్కగా రూపొందించబడిందని అభినందించారు. పోటీల్లో ఐపీఆర్, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు వంటి సమకాలీన అంశాలపై విద్యార్థులు వాదనలు వినిపించారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
🔸విజేతలు : జె. దీప్తి, డి. సుశీల, సి. నరసింహ రెడ్డి
🔸రన్నర్స్ – అప్ : ఎ. వైభవ్, ఎస్.కె. సమీరా, షహనాజ్
🔸ఉత్తమ ప్రతివాదన : ఎం. ఆయూబ్ ఖాన్
🔸ఉత్తమ మూటర్ : టి. శిరీష
🔸ఉత్తమ పరిశోధకురాలు : ఎస్. మోనికా సింగ్
🔸ఉత్తమ మెమోరియల్స్ : జి. రాఘవేంద్ర, జి. సంతోష్ కుమార్, జి. సందీప్ బాబు.
