ఐపీఆర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అనంత లా కాలేజీలో మూట్ కోర్ట్ పోటీలు
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ హక్కుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై అనంత లా కాలేజీలో ఐదవ అంతర్గత మూట్ కోర్ట్ పోటీలు ఘనంగా జరిగాయి. గురువారం కూకట్ పల్లిలోని కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో 38 జట్లు పాల్గొని తమ వాదనా పటిమను ప్రదర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.వి. చంద్రమతి, కరస్పాండెంట్ డా. రవి అనంత మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి న్యాయశాస్త్ర విభాగం డీన్ ప్రొఫెసర్ డా. ఎన్. వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు....