సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, శాన్సీ ఆర్ఎఫ్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అందించేందుకు సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ (సీఎంఆర్టీసీ) కీలక అడుగు వేసింది. సికింద్రాబాద్ కు చెందిన శాన్సీ ఆర్ఎఫ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు పరిశ్రమ ఆధారిత శిక్షణ, పరిశోధన, ఇంటర్న్ షిప్ లు, ప్రాజెక్టులకు మార్గదర్శకత్వం అందించనున్నారు.శాన్సీ సంస్థ ఆర్ఎఫ్, మైక్రోవేవ్ సాంకేతికత, రేడియో కమ్యూనికేషన్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ రంగాల్లో విశేష అనుభవం కలిగి ఉంది.ఇరు...