ఒడిశా నుంచి సోలాపూర్‌కు గంజాయి తరలింపు.. దుండిగల్‌లో పట్టివేత
డీసీఎంలో 426 కిలోల గంజాయి.. ఆరుగురి అరెస్టు రూ.2.28 కోట్ల విలువైన సరుకు స్వాధీనం.. మరో ఇద్దరు పరారీ ఆర్.జె.న్యూస్, కుత్బుల్లాపూర్ : ఒడిశా నుంచి మహారాష్ట్రకు భారీగా గంజాయి తరలిస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్‌వోటీ, కుత్బుల్లాపూర్ జోన్ బృందం పట్టుకున్నారు . డీసీఎం వాహనంలో తరలిస్తున్న 426 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆరుగురిని అరెస్టు చేసారు . పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2,28,87,350 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన దుండిగల్ సర్వీస్ రోడ్డులోని ఓఆర్‌ఆర్ ఎగ్జిట్-5 వద్ద మంగళవారం...