శాంతి నగర్‌లో ముత్యాలమ్మ కల్యాణోత్సవం..! అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి

ఆర్.జె.న్యూస్, జవహర్ నగర్ : మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శాంతి నగర్ లో శ్రీ ముత్యాలమ్మ తల్లి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ కల్యాణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ...