సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్
🔸పెండింగ్ కేసుల పరిష్కారానికి సువర్ణావకాశం 🔸రాజీమార్గంతో వివాదాలకు ముగింపు 🔸 ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి: సీనియర్ జడ్జి జీ.ఎస్.ఎల్. ప్రియాంక ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు, కుటుంబ వివాదాలకు సామరస్యపూర్వకంగా పరిష్కారం కనుగొనేందుకు జాతీయ లోక్ అదాలత్ చక్కటి వేదిక అని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ జడ్జి జీ.ఎస్.ఎల్. ప్రియాంక అన్నారు. సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.కుషాయిగూడలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా...