ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం కావాలి

అక్టోబర్‌ 1 నాటికి 15 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి: అదనపు కలెక్టర్‌ ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ : రానున్న ధాన్యం కొనుగోలు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు జిల్లా కలెక్టర్‌ (పౌరసరఫరాలు) జి. విజయేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణకు సంబంధించి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లాలోని 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అక్టోబర్‌ 1 నాటికి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి కేంద్రంలో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు,...