ఆర్.జె.న్యూస్, కీసర : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కీసర శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ కుమార్తె నీసా దేవగణ్ దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయానికి విచ్చేసిన నీసా దేవగణ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. బాలీవుడ్ ప్రముఖ కుటుంబానికి చెందిన నీసా దేవగణ్ కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి నిత్యం భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. బాలీవుడ్ స్టార్ కిడ్ రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.