మేడ్చల్‌ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ప్రసవ సేవలపై నిర్లక్ష్యం..!

ఆర్.జే.న్యూస్, మేడ్చల్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవ సేవలు అందించాల్సిన వైద్య సిబ్బంది అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మేడ్చల్‌ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ప్రసవం కోసం వచ్చే గర్భిణులను గాంధీ ఆసుపత్రికి తరలించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రసవం సమీపించిన ఓ గర్భిణీని 108 అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా బోయినపల్లి వద్ద అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది. దీంతో 108 సిబ్బంది అక్కడే ప్రసవం అనంతరం తల్లీబిడ్డను సురక్షితంగా తరలించాల్సి వచ్చింది. ప్రభుత్వ వైద్య సేవలపై ఆధారపడే...