ఇందిరమ్మ ఇంట్లో కొత్త వెలుగులు..! అలియాబాద్‌లో ఘనంగా గృహప్రవేశం

ఆర్.జె.న్యూస్.మేడ్చల్ : పేదల సొంతింటి కలను సాకారం చేసే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించుకున్న నూతన ఇంటి గృహప్రవేశ కార్యక్రమం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా జరిగింది. 12వ వార్డు యాడారం గ్రామానికి చెందిన మద్దుల నారం రెడ్డి–లక్ష్మి దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా...