RJNEWS TELUGU
Date of Publish : 29 September 2026, 9:38 am Posted by : RJ NEWS TELUGU

ఎల్లంపేట్‌లో బీజేపీ మహిళా మోర్చా నూతన బాధ్యతలు

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : బీజేపీ మేడ్చల్ జిల్లా మహిళా మోర్చా కమిటీలో ఎల్లంపేట్ మున్సిపాలిటీకి చెందిన పలువురికి వివిధ బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ రజిత దేవేందర్‌రెడ్డిని మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలిగా నియమించారు. అర్చన శ్రీనివాస్ ముదిరాజుకు ‘మన్‌ కీ బాత్’ జిల్లా కన్వీనర్‌గా, శారద రాజునాయక్‌కు కో-కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించారు. మహేశ్వరి రాజేష్‌ను జిల్లా కార్యవర్గ సభ్యురాలిగా, పుష్ప మల్లారెడ్డిని ఎల్లంపేట్ మున్సిపాలిటీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారిని బీజేపీ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎల్లంపేట్ గౌరారం జగన్‌గౌడ్, బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, మాజీ సర్పంచ్ పోచయ్య, ముదిరాజు నాయకులు జీఎస్ కంచు గంట మహేశ్, రవి నాయక్, లక్ష్మణ్, రాజు నాయక్, రాజేష్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు

.