RJNEWS TELUGU
Date of Publish : 16 September 2026, 9:14 pm Posted by : RJ NEWS TELUGU

లింగం చెరువులో గణేష్‌ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్: సూరారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద జరగనున్న గణేష్‌ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సైబరాబాద్‌ సీపీ రమేష్‌, ఐపీఎస్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సృజన, కుత్బుల్లాపూర్‌ డీసీపీ ఎన్‌.కె.రెడ్డి తదితర పోలీసు, వివిధ శాఖల అధికారులు బుధవారం పరిశీలించారు.నిమజ్జనం సందర్భంగా బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ, లైటింగ్‌, పారిశుధ్యం, చెరువు పరిసరాల ఏర్పాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు.