బియ్యం అక్రమ వ్యాపారంపై అధికారుల కొరడా!
🔸తక్కువ తూకం.. అధిక ధరలకు విక్రయాలు నలుగురు ట్రేడర్లపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు ఆర్ జె న్యూస్, మేడ్చల్ : బియ్యం ధరల పెరుగుదలను అరికట్టడంతో పాటు అక్రమ వ్యాపార కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. కమిషనర్ పౌరసరఫరాల శాఖ ఆదేశాల మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఉప్పల్, బాలానగర్ సర్కిళ్ల పరిధిలోని బియ్యం వ్యాపారుల దుకాణాలు, గోదాముల్లో సహాయ పౌరసరఫరాల అధికారుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో తక్కువ తూకంతో బియ్యం విక్రయించడం,...