RJNEWS TELUGU
Date of Publish : 26 November 2026, 8:50 pm Posted by : RJ NEWS TELUGU

చెక్‌పోస్టు నుంచి సుతారిగూడ వెళ్లే దారిలో గంజాయి విక్రయాలు.. పోలీసుల దాడులు

🔸ఇద్దరు పట్టివేత.. మరొకరు పరారీ.. 50 కిలోల గంజాయి స్వాధీనం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలపై ఎస్‌ఓటీ, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. చెక్‌పోస్టు నుంచి సుతారిగూడ చెరువు వైపు వెళ్లే దారిలో ముగ్గురు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారయ్యాడు.

నిందితుల నుంచి మూడు సెల్‌ఫోన్లతో పాటు 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.20 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. ఈ ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.