సన్న వడ్ల బోనస్‌కు ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి
ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల సన్న వడ్లను సాగు చేసిన రైతులకు మాత్రమే క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ అందుతుందని మేడ్చల్ మండల వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రెడ్డి తెలిపారు. బోనస్ పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం బోనస్‌కు ఎంపిక చేసిన బీపీటీ-5204, హెచ్‌ఎంటీ సోనా, కేఎన్‌ఎల్‌ఎం-1638, జై శ్రీరామ్, 22-7715, ఆర్‌ఎన్‌ఆర్-15048, డబ్ల్యూజీఎల్-44 రకాలను సాగు చేసిన రైతులకు మాత్రమే ఈ ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు. విత్తన డీలర్లు, షాపుల...