చంద్రగిరి కాలనీ మీదుగా రైల్వే అండర్ బ్రిడ్జికి వ్యతిరేకత
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : వినాయక్ నగర్ డివిజన్‌లోని చంద్రగిరి కాలనీ మీదుగా ప్రతిపాదించిన రైల్వే అండర్ వంతెన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తూర్పు, పడమర చంద్రగిరి కాలనీ, సంతోష్ మా నగర్, పరిసర ప్రాంతాల కాలనీవాసులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. సూర్యోదయ సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్‌లో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు “మాకొద్దు అండర్ వంతెన” అంటూ నినాదాలు చేస్తూ, ప్రత్యామ్నాయ మార్గంలో వంతెన నిర్మించాలని శాసనసభ్యులకు...