రూ.13 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్
ఆర్ జె న్యూస్ క్రైమ్ బ్యూరో : అధికారిక పనులకు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలలో చిక్కారు. ఫోన్‌పే ద్వారా లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి జె. వరలక్ష్మిని ఏసీబీ అధికారులు గురువారం ట్రాప్ చేసి అరెస్ట్ చేశారు. 🔸ఇంటి నంబర్ కోసం రూ.20 వేల డిమాండ్ లింగాయిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతి, కొత్తగా కట్టిన ఇంటికి ఇంటి నంబర్ కేటాయించాలని వరలక్ష్మిని...