మేడ్చల్‌లో దేశభక్తి వెల్లువ

🔸350 మీటర్ల జాతీయ పతాకంతో పీవీ పాఠశాల విద్యార్థుల ఘన తిరంగా ర్యాలీ ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ పట్టణంలో పీవీ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ దేశభక్తి స్ఫూర్తిని చాటింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు సుమారు 350 మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ పట్టణంలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులు దేశభక్తి నినాదాలు చేశారు. జాతీయ పతాకాన్ని గౌరవిస్తూ,...