RJNEWS TELUGU
Date of Publish : 13 August 2026, 6:29 pm Posted by : RJ NEWS TELUGU

ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి సచిన్‌ సావంత్‌తో పీసరి మహిపాల్‌రెడ్డి భేటీ

ఆర్.జె.న్యూస్,మేడ్చల్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పనితీరును విశ్లేషించేందుకు గాంధీభవన్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జిలు టీపీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్‌ సెక్రటరీలతో నిర్వహిస్తున్న సమావేశాల నేపథ్యంలో టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ పీసరి మహిపాల్‌రెడ్డి ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి సచిన్‌ సావంత్‌తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించిన తీరును మహిపాల్‌రెడ్డివివరించారు.ముఖ్యంగా వరంగల్‌ ఈస్ట్‌ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటుమేడ్చల్‌–మాల్కాజ్‌గిరి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను బీఎల్‌ఏ, బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా పూర్తి చేసిన వివరాలనువెల్లడించారు.మహిపాల్‌రెడ్డి పనితీరును సచిన్‌ సావంత్‌ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.