RJNEWS TELUGU
Date of Publish : 19 September 2026, 8:44 pm Posted by : RJ NEWS TELUGU

పలు వినాయక మండపాల్లో పీసరి మహిపాల్‌రెడ్డి పూజలు

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని శామీర్‌పేట్‌, బొమరాశిపేట్‌ గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్‌రెడ్డి శామీర్‌పేట్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నక్క సందీప్‌గౌడ్‌తో కలిసి ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సుమారు 30 వినాయక మండపాలను సందర్శించారు.మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నిర్వాహకులు, భక్తులతో మాట్లాడి ఉత్సవాల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మహిపాల్‌రెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు వైఎస్‌ శంకర్‌గౌడ్‌, మాజీ ఎంపీటీసీ ఇందిర, గ్రామ అధ్యక్షులు ఆంజనేయులు, అశోక్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు నాగరాజు, భరత్‌, మహేష్‌, భాగ్యనగర్‌ ఉత్సవ సమితి సభ్యులు రాకేష్‌, శ్రీకాంత్‌రెడ్డి, నర్సింహారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి దీపక్‌రెడ్డి, శామీర్‌పేట్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవీన్‌, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు రోహిత్‌రెడ్డి, ప్రజ్వల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.