అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి
రెండో విడతలో తిరస్కరణకు గురైన దరఖాస్తులను మరోసారి పరిశీలించాలి జిల్లా కలెక్టర్కు 7వ వార్డు కౌన్సిలర్ గాదె వెంకటేష్ వినతి ఆర్ జె న్యూస్ , మేడ్చల్ : అలియాబాద్ మున్సిపాలిటీలో రెండో విడత ఆసరా పెన్షన్ల మంజూరులో అర్హులైన వారికి అన్యాయం జరగకుండా చూడాలని 7వ వార్డు కౌన్సిలర్ గాదె వెంకటేష్ కోరారు. ఈ మేరకు సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండో విడత పెన్షన్ల కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో కొందరికి మాత్రమే...