భక్తిశ్రద్ధలతో గణనాథుడి శోభాయాత్ర
నిమజ్జన కార్యక్రమానికి హాజరైన ఆర్టీఏ మెంబర్ జైపాల్‌రెడ్డి, సీఐ కొండా నర్సింహారెడ్డి శామీర్ పేట : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శామీర్‌పేట్ డివిజన్ పరిధిలోని ఉప్పరపల్లిలో అంబేద్కర్ వారియర్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.యూత్ సభ్యుల ప్రత్యేక ఆహ్వానం మేరకు జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్‌రెడ్డి, శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ సీఐ కొండా నర్సింహారెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.శోభాయాత్ర, నిమజ్జన...