ఎమ్మెల్యే మల్లారెడ్డికి మైనార్టీ సోదరుల వినతి
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ప్రార్థనా స్థలాలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడ్చల్‌కు చెందిన మైనార్టీ సోదరులు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి వినతిపత్రం అందజేశారు. రోడ్డు కటింగ్, విస్తరణ పనులతో ఏడు గుడులు ఆలయాలు,దర్గా ప్రభావితమయ్యే పరిస్థితి ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వీటిలో రెండు ఆలయాలు యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన పరిష్కారం చూపాలని కోరారు. రహదారి అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, ప్రార్థనా స్థలాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంధాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్,కో ఆప్షన్ మహబూబ్అలీ, ఇనైత్ అలీ, ఆసిన్ భాయ్ ,ఆరిఫ్ బాయ్, హైమద్ తదితరులు పాల్గొన్నారు.