జాతీయ రహదారి విస్తరణలో ప్రార్థనా స్థలాలను పరిరక్షించాలి

ఎమ్మెల్యే మల్లారెడ్డికి మైనార్టీ సోదరుల వినతి ఆర్ జె న్యూస్, మేడ్చల్ : జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ప్రార్థనా స్థలాలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడ్చల్‌కు చెందిన మైనార్టీ సోదరులు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి వినతిపత్రం అందజేశారు. రోడ్డు కటింగ్, విస్తరణ పనులతో ఏడు గుడులు ఆలయాలు,దర్గా ప్రభావితమయ్యే పరిస్థితి ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వీటిలో రెండు ఆలయాలు యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన పరిష్కారం...