అక్రమ గోధుమపిండి గోదాంపై పోలీసుల దాడి!

🔸సుభాష్‌నగర్‌లో పంజాబ్‌ రేషన్‌ గోధుమల నిల్వలు స్వాధీనం 🔸 51 సంచుల గోధుమలు సీజ్‌.. 🔸 నిందితుడు రమేష్‌ అగర్వాల్‌ అరెస్ట్‌ ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : సుభాష్‌నగర్‌లో అక్రమంగా గోధుమపిండి తయారు చేసి ప్రముఖ బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్‌ చేస్తున్న వ్యవహారంపై పోలీసులు కొరడా ఝళిపించారు. స్వేచ్ఛ పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన పోలీసులు జీడిమెట్ల పరిధిలోని పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి సుభాష్‌నగర్‌లో ఉన్న గోధుమపిండి గోదాంపై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పంజాబ్‌ రాష్ట్ర సివిల్‌ సప్లై గోధుమలుగా గుర్తించిన...